![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ షో 200 ఎపిసోడ్స్ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇక ఇందులో ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ళ కోరికను చెప్పి చేతిలో ఒక కర్రను విరగ్గొట్టారు. ఇంతకు ఎవరెవరు ఎం కోరిక కోరుకుని కర్ర విరగ్గొట్టారు. ఎవరు విరగ్గొట్టలేకపోయారో చూద్దాం. ముందుగా శ్రీముఖి వచ్చి స్టార్ మా పరివారం షో 200 నుంచి 500 వరకు మేమందరం ఇలానే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా అంటూ కర్ర విరగ్గొట్టింది.
"నేను ప్రతీ ఆదివారానికి తప్పకుండా రావాలి .. నా కలల రాణి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ " అంటూ కళ్ళజోడు దించి మరీ కైపుగా డెబ్జానీ వైపు చూసాడు అమరదీప్. కానీ కర్ర విరగ్గొట్టలేకపోయాడు. తర్వాత డెబ్జానీ వచ్చింది. "నాన్న కివి ఫ్రూట్ బిజినెస్ చేస్తారు . అది మంచిగా జరగాలని కోరుకుంటున్నా " అంటూ కర్ర విరగ్గొట్టేసింది. "ఆడపిల్ల విరగ్గొట్టింది కదయ్యా నీ మొహం " అంటూ ఇమ్మానుయేల్ అమర్ మీద కౌంటర్ వేసాడు.
"నేను ఇమ్మానుయేల్ తో ఒక వీడియో సాంగ్ చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ఆ కర్రను విర్రోగ్గట్టడానికి ట్రై చేసింది కానీ కాలేదు. ఇమ్మానుయేల్ దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు కర్ర విరగాలి అని కానీ అతను ట్రై చేసినా విరగలేదు. తర్వాత శ్రీముఖి ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. "మమ్మల్ని ఎన్నో ఎపిసోడ్స్ లో డాన్స్ ద్వారా ఎంటర్టైన్ చేశారు. దాంట్లో నంబర్ 1 ఎవరు" అంటూ అక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చింది. ఇక బాలు వెళ్లి 9 నంబర్ దగ్గర నిలబడ్డాడు. "బాలు 9 ఎందుకు " అని అడిగింది. " నా సీరియల్ టైమింగ్ 9 కదా " అని అమాయకంగా ఆన్సర్ ఇచ్చాడు. "నిజాయితీగా చెప్పావు కానీ నువ్వు నంబర్ 1 లో ఉండాలి " అంటూ బాలుకి సపోర్ట్ చేసింది శ్రీముఖి.
![]() |
![]() |